by Suryaa Desk | Wed, Jan 22, 2025, 11:29 AM
గ్రేటర్‌లో రాత్రివేళల్లో చలి తీవ్రత పెరిగింది. మధ్యాహ్నం 32 డిగ్రీల వరకు పగటి ఉష్ణోగ్రతలు నమోదై ఎండ తీవ్రత పెరిగినా, రాత్రుళ్లు కనిష్ఠ ఉష్ణోగ్రతలతో 8-13 డిగ్రీల వరకు నమోదవుతుండటంతో చలిగాలుల తీవ్రత పెరిగింది.మంగళవారం పటాన్‌చెరు(Patancheru)లో అత్యల్పంగా 8.6డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాజేంద్రనగర్(Rajendranagar)లో 10, దుండిగల్‌లో 13.8, బేగంపేట ప్రాంతాల్లో 13.8, హయత్‌నగర్‌లో 16 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పలు ప్రాంతాల్లో సాధారణం కంటే 6 డిగ్రీల ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతుండటంతో చలితీవ్రత అధికంగా ఉంది. తెల్లవారు జామున ప్రధాన రహదారులను పొగమంచు కప్పేయడంతో వాహనదారులు ముందుకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారు.