by Suryaa Desk | Wed, Jan 22, 2025, 11:45 AM
మేడిపల్లి మండల విద్యా వనరుల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ఎఐటియుసి అనుబంధ తెలంగాణ మధ్యాహ్న భోజన వర్కర్స్ యూనియన్ మార్కెట్ ధరలకు అనుగుణంగా ధరలు ఇవ్వాలని తమ సమస్యలను తెలుపుతూ
1) కోడిగుడ్లకు ప్రభుత్వం రూ॥ 5లు చెల్లిస్తుంటే మార్కెట్లో రూ॥ 8 లకు లభిస్తుంది. రూ॥3ల నష్టంతో విద్యార్థులకు అందించలేమని
ప్రభుత్వమే పూర్తిగా కోడిగుట్లను సరఫరా చేర్యాలని, 2) మార్కెట్ ధరలకు అనుగుణంగా మెనూ చార్జీలు లేనందున 2 కూరలతో భోజనాలు అందించలేమని, 3) మెనూ చార్జీలు ప్రతి విద్యార్థికి రూ॥ 25లు చెల్లించాలని, 4) వంట కార్మికులకు తొలగించకుండా జి.ఓ. విడుదల చేర్యాలని, 5) ప్రభుత్వం చెల్లిస్తామన్న రూ॥ 10వేల వేతనం వెంటనే చెల్లించాలని, 6) వంట సందర్భంలో జరుగుతున్న ప్రమాదాలకు ప్రమాదభీమా సౌకర్యం కల్పించాలని వినతి పత్రం అందజేశారు.