by Suryaa Desk | Wed, Jan 22, 2025, 03:45 PM
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రజల ముంగిట్లోకి సంక్షేమ పథకాలను తెచ్చామని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు. బుధవారం కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలో ప్రభుత్వం అమలు చేసే నాలుగు సంక్షేమ పథకాల కోసం లబ్ధిదారుల ఎంపికకు గ్రామసభ నిర్వహించారు. ఈకార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి శ్రీమాల, ఎంపీడీవో రామ్మోహనచారి, తహసిల్దార్ వకీల్, మాజీ ఎంపీపీ గోపగోని సారయ్యగౌడ్ పాల్గొన్నారు.