by Suryaa Desk | Mon, Jan 20, 2025, 08:53 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఫొటోలను మార్ఫింగ్ చేశారని, అలా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ జాగృతి మహిళా విభాగం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కవిత ఫొటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన 'అర్వింద్ అన్న ఆర్మీ' అనే ట్విట్టర్ హ్యాండింల్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. వారి వెనుక ఉన్న వారిపై కూడా చర్యలు తీసుకోవాలన్నారు.ఈరోజు మేడ్చల్ జిల్లా తెలంగాణ జాగృతి మహిళా అధ్యక్షురాలు, కార్పోరేటర్ లలిత యాదవ్ ఆధ్వర్యంలో పలువురు సైబర్ క్రైమ్ పోలీసులను కలిసి ఫిర్యాదు చేశారు. ఫొటోలు మార్ఫింగ్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన కీలక నాయకుడి ఆర్మీ అంటూ సోషల్ మీడియాలో విచ్చలవిడిగా అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.