by Suryaa Desk | Mon, Jan 20, 2025, 08:17 PM
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ హుండీ ఆదాయం రూ.4,17,13,596 లు చేకూరింది.గత 47 రోజులుగా వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు హుండీలలో సమర్పించిన నగదు, నగల కానుకల లెక్కింపు పర్వం దేవస్థానం చేపట్టింది.కొండకింద ఆధ్యాత్మిక వాడలోని శ్రీసత్య నారాయణస్వామి వ్రత మండపంలో సోమవారం చేపట్టిన లెక్కింపులో ఆలయ ఉద్యోగులు,కల్యాణకట్ట సిబ్బంది,అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు,భక్తులు,మహిళా సేవ సమాఖ్య బృందాలు పాల్గొన్నాయి. కొనసాగిన లెక్కింపులో నగదు రూ.4,17,13,596, మిశ్రమ బంగారం 229 గ్రాములు, వెండి7,050 గ్రాములు చేకూరినట్లు ఈవో భాస్కరరావు తెలిపారు. ఎస్పీఎఫ్ జవాన్లు,సీసీ కెమెరాల నిఘా మధ్య ఉదయం నుంచి సాయంత్రం వరకు లెక్కింపు పర్వం కొనసాగింది.