by Suryaa Desk | Mon, Jan 20, 2025, 08:58 PM
కక్షసాధింపు రాజకీయాల'పై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కక్ష సాధింపు రాజకీయాలకు తాను వ్యతిరేకమన్నారు. కక్ష సాధింపు రాజకీయాలు ఏ పార్టీకి లేదా ఏ ప్రభుత్వానికి మంచిది కాదన్నారు. అలాంటి రాజకీయాలు చేసేవాళ్లు అధికారం కోల్పోయాక బాధపడాల్సి వస్తుందని హెచ్చరించారు.దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి, కొణిజేటి రోశయ్య వంటి నేతలు ఎప్పుడూ కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడలేదన్నారు. తనకు ఎవరైనా నష్టం చేసినా... తాను మాత్రం ఎవరికీ నష్టం చేయలేదన్నారు. రాజకీయ యుద్ధం మాత్రం చేస్తామన్నారు. ఏ రాజకీయ పార్టీ అయినా, నాయకుడైనా డబ్బులు తీసుకోకుండా రాజకీయం చేస్తున్నట్లుగా ఎవరైనా అంగీకరిస్తారా? అని ప్రశ్నించారు. తనతో సహా డబ్బులు ముట్టకుండా రాజకీయం చేసిన నాయకులు ఎవరూ లేరన్నారు.