by Suryaa Desk | Tue, Jan 21, 2025, 05:39 PM
రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా కోరుట్ల పట్టణంలోని బస్టాండ్ ఆవరణలో మంగళవారం జగిత్యాల డిస్టిక్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ శ్రీనివాస్, ఆర్టీసీ డిపో మేనేజర్ మనోహర్ ప్రజలకు రోడ్డు భద్రతపై ప్రమాదాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కళాకారులు రాగుల పరుశురాం గౌడ్, ఎముడాల మైపాల్, రాజేందర్, పంచరి ప్రవీణ్, భోగే అశోక్, రమేష్, పోచయ్య, రాజ్ కుమార్, రమ్య, రాజేశ్వరి పాల్గొన్నారు.