by Suryaa Desk | Tue, Jan 21, 2025, 04:29 PM
మండలంలో ఉన్న అన్ని గ్రామాల రైతులు పశువులకు ఉచిత వైద్యం సద్వినియం చేసుకోవాలని కోరారు జిల్లా పశుగణభివృద్ధి సంస్థ పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలోఆత్మకూరు మండలం లోని కామారం గ్రామంలో ఉచిత గర్భకోశవ్యాధుల చికిత్స శిబిరన్ని నిర్వహించడం జరిగింది.
ఈ శిబిరాన్ని స్థానిక పశువైద్యదికారి డాక్టర్ ధర్మానాయక్ ప్రారంభించి పశువులకు లింగనిర్ధారిత వీర్యంతో కృత్రిమగర్భధారణ చేయడం వల్ల మేలుజాతి ఆడ దూడలు వృద్ధి చెందుతాయని పేర్కొన్నారు ఈ వైద్యశిబిరంలొ 32 పశువులకు గర్భధారణ పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలొ లతీఫ్ పాషా- పశువైద్య సహాయకులు , గోపాలమిత్ర సూపెర్వైసర్ ప్రకాష్ రెడ్డి గోపాలమిత్రులు గోపు. సతీష్ మదూకర్, సుదర్శన్, సుమన్, రంజిత్ రైతులు అధిక సంఖ్యలొ పాల్గొన్నారు