by Suryaa Desk | Tue, Jan 21, 2025, 05:35 PM
TG: 25 ఏళ్ల జీవితంలో ఎవరిపై చేయి చేసుకోలేదు.. కానీ ఈరోజు న్యాయం కోసం చేయి చేసుకోవాల్సి వచ్చిందని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ వివరణ ఇచ్చారు. పోచారం మున్సిపాలిటీ పరిధిలోని ఏకశిలానగర్ భూముల్లో ఓ బాధితుడు ఇళ్ళు కట్టుకుంటుంటే కూల్చివేశారని వాపోయాడని ఎంపీ తెలిపారు. అది చూద్దామని అక్కడికి వెళ్తే రౌడీలు మద్యం సేవిస్తూ హంగామా చేశారని పేర్కొన్నారు. చులకనగా మాట్లాడటంతోనే సదరు వ్యక్తిపై చేయి చేసుకున్నట్లు క్లారిటీ ఇచ్చారు.