by Suryaa Desk | Mon, Jan 20, 2025, 08:19 PM
రాష్ట్రంలోని మందుబాబులకు గుడ్‌న్యూస్.. తెలంగాణలో మళ్లీ కింగ్‌ఫిషర్ బీర్లు అందుబాటులోకి రాబోతున్నాయి. రాష్ట్రంలో కింగ్‌ఫిషర్, హెన్‌కిన్ బీర్ల సరఫరాను పునరుద్ధరిస్తున్నట్లు వాటి తయారీ సంస్థ అయిన యునైటెడ్ బ్రేవరీస్ వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వంతో చర్చల అనంతరం బీర్ల సరఫరాలపై సోమవారం తన నిర్ణయాన్ని ప్రకటించింది.తమ డిమాండ్లపై ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని తెలపడంతో వినియోగదారులు, కార్మికులను దృష్టిలో ఉంచుకుని కంపెనీ వెనక్కి తగ్గినట్లు యునైటెడ్ బ్రేవరీస్ తెలిపింది. ప్రభుత్వ హామీతో బీర్ల సరఫరాను పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించింది. ధరల పెంపు, బకాయిలపై రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుందని తెలిపింది.రాష్ట్రంలో కింగ్‌ఫిషర్ బీర్లను పునరుద్ధరిస్తున్నామని ప్రకటించిన నేపథ్యంలో యునైటెడ్ బ్రేవరీస్ షేర్ ధర దూసుకెళ్లింది. అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. ఒక దశలో ఆరు శాతానికి పైగా పెరిగి ఇంట్రా డేలో రూ.2075 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. స్టాక్‌మార్కెట్లు ముగిసేసరికి 5.54 శాతం లాభంతో షేర్ ధర రూ.2059.40 వద్ద కొనసాగుతోంది. కంపెనీ మార్కెట్ విలువ ప్రస్తుతం రూ.53.51 వేల కోట్లుగా ఉంది.