by Suryaa Desk | Tue, Jan 21, 2025, 06:02 PM
జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలంలోని ఉత్తనూరు గ్రామంలో మంగళవారం గోపాల దాసుల వారి ఆరాధన ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు. ఉత్సవాల సందర్భంగా స్వామివారికి విగ్రహానికి అభిషేకం, కుంకుమార్చన, పవమాన హోమం తదితర పూజలను నిర్వహించారు. స్వామివారిని దర్శించుకునేందుకు కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల నుంచి భక్తులు వచ్చారు.