by Suryaa Desk | Mon, Jan 20, 2025, 08:16 PM
ఇబ్రహీంపట్నం నియోజకవర్గం తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలో సోమవారం పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, రాష్ట్ర రోడ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రాంరెడ్డి, మున్సిపల్ చైర్మన్ మల్ రెడ్డి అనురాధ రాంరెడ్డి తో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గుండ్లపల్లి హరిత ధనరాజ్ గౌడ్, గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు.