by Suryaa Desk | Wed, Jan 22, 2025, 11:23 AM
రామచంద్రాపురం మండలం వెలివెల తండాలో గిరిజనుల భూములు ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా గిరిజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకయ్యకు బుధవారం వినతిపత్రం సమర్పించారు. సాగు చేసుకుంటున్న భూములు గిరిజనులకు ఇవ్వాలని కోరారు కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు జైపాల్ నాయక్ నాయకులు పాల్గొన్నారు.