by Suryaa Desk | Wed, Jan 22, 2025, 11:33 AM
మల్యాల మండల కేంద్రానికి చెందిన మల్యాల సతీష్ కుమార్ సావిత్రి బాయి పూలే జాతీయ ఐకాన్ అవార్డు అందుకున్నారు. సోమవారం హైదరాబాద్ రవీంద్ర భారతి ఆడిటోరియంలో అభిలాష హెల్పింగ్ హాండ్స్ ఆర్గనైజేషన్ వారిచే మహనీయురాలు సావిత్రి బాయిపూలే జయంతి మరియు ఆర్గనైజేషన్ 5వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని రెండు తెలుగు రాష్ట్రాల్లో వివిధ రంగాలలో సేవలు అందిస్తున్న వారిని గుర్తించి అవార్డులు అందజేసి సత్కరించారు. అందులో భాగంగా కళాకారుడిగా, జర్నలిస్టుగా సమాజానికి సేవలు అందిస్తున్న మల్యాల సతీష్ కుమార్ కు జాతీయ ఐకాన్ అవార్డు అందజేశారు.
ఈ సంధర్బంగా సతీష్ కుమార్ మాట్లాడుతూ.. మహోన్నత వ్యక్తి, సంఘ సంస్కర్త, మహనీయురాలు సావిత్రిబాయి పూలే గారి పేరిట అవార్డు అందుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నా, నా సేవలు గుర్తించి నన్ను ఈ అవార్డుకు ఎంపిక చేసిన అభిలాష హెల్పింగ్ హాండ్స్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు డాక్టర్ ఎస్.సరోజనమ్మ , ఆర్గనైజేషన్ సభ్యులకు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపినట్లు తెలిపారు.