by Suryaa Desk | Wed, Jan 22, 2025, 11:20 AM
యువత క్రీడల పట్ల ఆసక్తిని పెంచుకోవాలని ఆత్మకూర్ మాజీ ఎంపీపీ మార్క సుమలత రజనీకర్ గౌడ్ అన్నారు సోమవారం కటాక్షపూర్ అమ్మదీయా ముస్లిం జమాత్ సమితి ఆధ్వర్యంలో ఒకరోజు క్రికెట్ టోర్నమెంట్ పెద్దాపూర్ గ్రామంలో నిర్వహించారు. క్రికెట్ టోర్నమెంట్ కి ఉమ్మడి వరంగల్ జిల్లా నలుమూలల నుండి క్రీడాకారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ ఎంపీపీ మార్క సుమలత రజనీకర్ గౌడ్ కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు కమలాపురం రమేష్ పరకాల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మాదాసి శ్రీధర్ ఆత్మకూరు మండలం యువజన కాంగ్రెస్ అధ్యక్షులు తనువుల సందీప్ పాల్గొని విజేతలకు బహుమతులను ప్రధానం చేశారు.
ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ మాట్లాడుతూ క్రీడలు దేహదారుడియంతోపాటు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయన్నారు చిన్ననాటి నుండే క్రీడల పట్ల ఆసక్తిని పెంచుకొని ముందుకెళ్లాలని ఆమె పిలుపునిచ్చారు కార్యక్రమంలో అమ్మదియా ముస్లిం జమాత్ వరంగల్ జిల్లా అధ్యక్షులు లతీఫ్ షరీఫ్ వృద్ధుల సంఘం అధ్యక్షులు యాకూబ్ పాషా జిల్లా సంఘం నాయకులు మసూద్ అహ్మద్ జిల్లా ఇన్చార్జి ఆఫీస్ తదితరులు పాల్గొన్నారు