by Suryaa Desk | Wed, Jan 22, 2025, 10:31 AM
TG: హైదరాబాద్ కాచిగూడ, మెదక్ రైల్వే స్టేషన్ మధ్య ఎలక్ట్రిక్ ట్రైన్ పరుగులు తీసింది. అక్కన్నపేట రైల్వే స్టేషన్‌లో సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు ఈ ట్రైన్ ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తి చేశారు. దీంతో భవిష్యత్తులో తిరుపతి, ముంబై వంటి ప్రాంతాలకు ట్రైన్లు నడిపేందుకు అవకాశం దొరికిందని అధికారులు అన్నారు. అక్కన్నపేట, మెదక్ ప్రజల సౌకర్యార్థం విద్యుత్ లైన్ ద్వారా ఇక ప్రతిరోజు ట్రైన్‌ను నడుపతామని రైల్వే అధికారులు వెల్లడించారు.