by Suryaa Desk | Wed, Jan 22, 2025, 11:06 AM
జిల్లాలో నిర్వహించు గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ డి.వేణు సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం అదనపు కలెక్టర్ డి.వేణు సమీకృత కలెక్టరేట్ లోని గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్ల పై సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ డి.వేణు మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవ వేడుకలు సమీకృత జిల్లా కలెక్టరేట్ లో జరుగుతాయని, జిల్లాలోని ప్రతి శాఖకు చెందిన అధికారులు , సిబ్బంది వేడుకలకు తప్పనిసరిగా హాజరు కావాలని అదనపు కలెక్టర్ తెలిపారు. గణతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించి ఫ్లాగ్ ఏర్పాట్లు, గ్రౌండ్ సిద్దం చేయడం మొదలగు ఏర్పాట్లు పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ అధికారులు సమన్వయంతో పూర్తి చేయాలని అన్నారు. గణతంత్ర వేడుకల డయాస్ , సీటింగ్ ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ అధికారులను ఆదేశించారు.ప్రోటోకాల్ ప్రకారం సీటింగ్ ఏర్పాట్లు చేయాలని, దీనిని అప్రమత్తంగా నిర్వహించాలని అన్నారు. ఏఎన్ఏం ఆధ్వర్యంలో వైద్య బృందాలచే శిభిరాలు ఏర్పాటు చేయాలని అన్నారు. ముఖ్య అతిథి గా జిల్లా కలెక్టర్ అందించే సందేశం రూపొందించేందుకు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల వివరాలను క్లుప్తంగా అందజేయాలని అన్నారు.
గణతంత్ర వేడుకల అవసరమైన మేర త్రాగు నీటి క్యాన్లు ఆర్.డబ్ల్యూ.ఎస్ అధికారులు మున్సిపల్ కమిషనర్ సమన్వయంతో ఏర్పాటు చేయాలని అదనపు కలెక్టర్ తెలిపారు.ప్రభుత్వ ప్రాదాన్యత అంశాలకు సంబంధించి స్టాల్స్ ఏర్పాటు చేయాలని అన్నారు.గణతంత్ర దినోత్సవ వేడుకలలో సాంస్కృతిక కార్యక్రమాల కోసం పాఠశాల విద్యార్థులను తరలించే సమయంలో అప్రమత్తంగా ఉండాలని వారికి అవసరమైన ఏర్పాట్లను పెద్దపెల్లి తహసిల్దార్ తో సమన్వయం చేసుకుంటూ ఏర్పాటు చేయాలని అదనపు కలెక్టర్ విద్యాశాఖ అధికారికి సూచించారు. గణతంత్ర వేడుకల సందర్భంగా అగ్నిమాపక సిబ్బంది అందుబాటులో ఉండాలని, విద్యుత్ సరఫరా ఇబ్బందులు రాకుండా జాగ్రత్త వహించాలని అన్నారు. విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన సిబ్బంది ప్రశంసా పత్రాలు అందజేసేందుకు ప్రతిపాదనలు పంపాలని అదనపు కలెక్టర్ తెలిపారు. జనవరి 26 నుంచి ప్రభుత్వం అమలు చేసే 4 కార్యక్రమాల లబ్ధిదారులకు ప్రోసిడింగ్స్ పంపిణీ కొరకు వేడుకల వద్ద అవసరమైన ఏర్పాట్లు చేసి సన్నద్ధంగా ఉండాలని అన్నారు. ఈ సమావేశంలో పెద్దపల్లి ఏసీపీ జి. కృష్ణ,జిల్లా అధికారులు, సంబంధిత అధికారులు,తదితరులు పాల్గొన్నారు.