by Suryaa Desk | Wed, Jan 22, 2025, 11:30 AM
అర్హులకు ప్రభుత్వ పథకాలు అందేలా సర్వే ప్రక్రియను కొనసాగించాలని అడిషనల్ కలెక్టర్ బిఎస్ లత కార్యదర్శులకు సూచించారు. మల్యాల మండలంలో కొత్త రేషన్ కార్డ్, ఇందిరా భరోసా, ఇందిరమ్మ ఇండ్ల పథకాలకు సంబంధించిన సర్వేను క్షేత్రస్థాయిలో కార్యదర్శులు సేకరిస్తున్నారు.
ఇట్టి ప్రక్రియను సోమవారం అడిషనల్ కలెక్టర్ బి ఎస్ లత మల్యాల మండలంలో సందర్శించారు. కుల గణన సర్వేలో పొందుపరిచిన విధంగా లిస్టులో పేరు రాని అర్హులైన అభ్యర్థుల కుటుంబ సభ్యుల వివరాలు ,ఆధార్ కార్డులు,ఇతర వివరాలు సేకరించి ఉంచాలని ఆమె వారికి సూచించారు. ఈ సర్వేలో తాసిల్దార్ మునీందర్, ఎం పీ ఓ స్వాతి, ఆర్ ఐ రాణి, మల్యాల కార్యదర్శి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.