by Suryaa Desk | Wed, Jan 22, 2025, 12:33 PM
దాతల సహకారం 50% ఉంటే 100కు వంద శాతం కళాశాలను తన సొంత ఖర్చులతో పూర్తి చేస్తానని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. మాజీ టీఎన్జీవోస్ నియోజకవర్గ అధ్యక్షుడు వెంకటరెడ్డి షాద్ నగర్ లో నిర్మాణం అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాలకు బుధవారం లక్ష రూపాయలు విరాళంగా అందించారు. ఈ మొత్తాన్ని నగదు రూపంలో స్థానిక క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాతల సహకారం మరువలేనిదని అన్నారు.