by Suryaa Desk | Wed, Jan 22, 2025, 01:01 PM
నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో 9వ డివిజన్ నిజాంపేట్ భవ్యస్ క్లబ్ హౌస్ మరియు 15వ డివిజన్ రాజీవ్ గాంధీ నగర్ నల్ల పోచమ్మ లో ప్రజా పాలనా వార్డు సభలో ముఖ్య అతిధులుగా డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ పాల్గొని 9వ డివిజన్ కార్పొరేటర్ రజిత రవికాంత్, 15వ డివిజన్ కార్పొరేటర్ గాజుల సుజాత, 20డివిజన్ కార్పొరేటర్ బాలాజీ నాయక్, కో-ఆప్షన్ సభ్యలు చంద్రగిరి జ్యోతి సతీష్ గార్లతో కలిసి వార్డ్ సభను ప్రారభించారు. ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ ఇండ్లు, స్థలం ఉన్న నిరుపేద కుటుంబాలకు ఇంటి నిర్మాణానికి 5లక్షల ఆర్ధిక సహాయం, 9, 10,11వ డివిజన్ లో అర్హులైన నిరుపేద కుటంబాలకు రేషన్ కార్డులు 128మంది గుర్తింపు, ఇల్లు స్థలం ఉన్న నిరుపేద కుటుంబాలకు ఇంటి నిర్మాణానికి 5 లక్షల ఆర్ధిక సహాయంగా 1 ఒక్కరు గుర్తింపు,అదే విధంగా 74 మందికి ఇందిరమ్మ ఇండ్లు, అనంతరం 15వ డివిజన్ లో అర్హులైన నిరుపేద కుటంబాలకు రేషన్ కార్డులు 325 మంది గుర్తింపు,ఇల్లు స్థలం ఉన్న నిరుపేద కుటుంబాలకు ఇంటి నిర్మాణానికి 5 లక్షల ఆర్ధిక సహాయంగా 72 మంది గుర్తింపు,అదే విధంగా 505 మందికి ఇందిరమ్మ ఇండ్లు అర్హులుగా గుర్తించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంఆర్ఓ ప్రభుదాస్, ఏఈలు గన్న ప్రసన్న, ప్రవీణ్, ఆర్వో రమేష్, వార్డు ఆఫీసర్ లు లోహిత, యశ్వంతి, వెంకట్, శ్రీకాంత్, పవన్, యువ నాయకులు ఆనంద్ రెడ్డి, స్థానిక నాయకులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు..