by Suryaa Desk | Wed, Jan 22, 2025, 03:58 PM
జగిత్యాల జిల్లామెట్ పల్లి పట్టణంలో బుధవారం అయోధ్యలో బాలరామున్ని ప్రతిష్టించి నేటితో ఒక సంవత్సరం పూర్తయిన సందర్బంగా మెట్ పల్లి కొత్త బస్టాండ్ దగ్గర బాల హనుమాన్ దగ్గర శ్రీరాముని స్మరిస్తూ ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. అనంతరం గట్టాడి విజయ్ ఆధ్వర్యంలో పలువురు భక్తులు స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం మండలం పద్మశాలి సంఘం అధ్యక్షులు చాట్ల గణేష్, తదితరులు ఉన్నారు.