by Suryaa Desk | Wed, Jan 22, 2025, 04:42 PM
రేషన్ కార్డుల కోసం ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని... అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు ఇస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భరోసా ఇచ్చారు. ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని... ఎవరూ ఆందోళన చెందవద్దని చెప్పారు. పేదలందరికీ రేషన్ కార్డులను మంజూరు చేస్తామని తెలిపారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు గ్రామసభలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈరోజు దరఖాస్తు చేసుకున్నా రేషన్ కార్డు ఇస్తామని ఉత్తమ్ తెలిపారు. రేషన్ కార్డులు ఇవ్వకుండా పదేళ్ల పాటు ప్రజలను బీఆర్ఎస్ మోసం చేసిందని మండిపడ్డారు. మరోవైపు ఈ నెల 24 వరకు రేషన్ కార్డులను దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఈ నెల 26 నుంచి అర్హులకు రేషన్ కార్డులను ప్రభుత్వం జారీ చేయనుంది.