by Suryaa Desk | Wed, Jan 22, 2025, 04:55 PM
సికింద్రాబాద్ ఎమ్మెల్యే, పార్టీ నేత పద్మారావు గౌడ్‌ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. ఈరోజు నగరంలోని పద్మారావు గౌడ్ ఇంటికి కేటీఆర్ వెళ్లారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కేటీఆర్ వెంట మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, వి శ్రీనివాస్ గౌడ్, పువ్వాడ అజయ్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ కవిత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తదితరులు ఉన్నారు.పద్మారావు గౌడ్ తన కుటుంబంతో సహా ఉత్తరాఖండ్ పర్యటనలో ఉన్న సమయంలో డెహ్రాడూన్‌లో గుండెపోటుకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు హుటాహుటిన అక్కడి ఆసుపత్రికి తరలించారు. స్టంట్ వేసిన వైద్యులు ఎలాంటి ప్రాణాపాయం లేదని చెప్పారు. అక్కడ చికిత్స అనంతరం పద్మారావు గౌడ్ హైదరాబాద్ చేరుకున్నారు.