by Suryaa Desk | Wed, Jan 22, 2025, 12:38 PM
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పరిధిలోని రాయికల్‌లోని ఓ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఎడిబుల్ ఆయిల్ ఫ్యాక్టరీలో మంగళవారం రాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆయిల్ నిల్వ ఉంచిన ట్యాంకర్‌లో మంటలు చెలరేగి పేలుడు చోటు చేసుకున్నది. ఫ్యాక్టరీలో మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, సంఘటనా స్థలం పక్కనే మరో ఆయిల్ ట్యాంకర్ ఉందని.. అది కూడా పేలే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. పరిశ్రమలో భారీగా అగ్నికీలలు ఎగిసిపడుతుడడంతో కార్మికులు బయటకు పరుగులు తీశారు. మంటలు ఎలా వ్యాపించాయన్నది తెలియరాలేదు. ఇందుకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.