by Suryaa Desk | Wed, Jan 22, 2025, 02:39 PM
పథకాల కోసం ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారికి ఇబ్బందులు తప్పడం లేదని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. బుధవారం(జనవరి22) సిద్దిపేటలో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. సంక్షేమ పథకాలకు ఎన్నో షరతులు పెడుతున్నారన్నారు. ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్లుగా రైతులకు పూర్తి రుణమాఫీ చెయ్యకుండా ఎగ్గొట్టారని విమర్శించారు. పథకాల కోసం ప్రజాపాలనలో ఇంకా ఎన్నిసార్లు దరఖాస్తులు చేసుకోవాలని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.‘సంక్షేమ పథకాలకు ఏడాది కిందట దరఖాస్తు ఇస్తే ఇప్పటికీ దిక్కు లేదు, మళ్ళీ ఎన్నిసార్లు దరఖాస్తులు ఇవ్వాలి. దరఖాస్తుల పేరుతో డబ్బులు వృథా అవుతున్నాయి. దరఖాస్తులతోనే ప్రభుత్వం కాలయాపన చేస్తోంది. అబద్దాల పునాదులపై కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి పాలనలో కూడా అబద్దాల పరంపర కొనసాగిస్తోంది. అప్పుడు అందరికీ పరమాన్నం పెడతామన్నారు. ఇప్పుడు అందరికీ పంగ నామాలు పెడుతున్నారు.
రుణమాఫీ అయిందని రేవంత్‌రెడ్డి హైదారాబాద్ లో చెప్తున్నాడు దమ్ముంటే ఇక్కడికి రా చూపెడత ఎంతమందికి కాలేదనేది. వడ్డీతో సహా రెండు లక్షల రుణమాఫి చేస్తానని ఇప్పుడు మిత్తీ కట్టించుకుని పాక్షిక రుణమాఫి చేస్తున్నారు. రేవంత్ రెడ్డి మాటలు నీటి మూటలు, అబద్ధాలు. దమ్ముంటే రేవంత్ రెడ్డి గ్రామ సభలకు రావాలి నేను కూడా వస్తా. పోలీసులను పెట్టి నిర్బంధాల మధ్య గ్రామ సభ నడిపిస్తున్నారు. రేవంత్ రెడ్డి డమ్మీ రుణమాఫీ చెక్ ఇచ్చావు. రెండు నెలలు అయినా రేవంత్ రెడ్డి ఇచ్చిన చెక్ పాస్ కాలేదు. ఈ ప్రభుత్వానికి చిత్త శుద్ధి లేదు. ఈ ప్రభుత్వానికి మోసాలు తప్ప, నీతి నిజాయితీ లేదు. రుణమాఫీపై వైట్ పెపర్ రిలీజ్ చేయాలి. ఎప్పటి లోగా చేస్తారో ఎన్ని చేయాలో చెప్పాలి. రాష్ట్రంలో రైతులు పిట్టల్లా రాలిపోతున్నారు. వానాకాలం రైతు బంధు ఎప్పుడు వేస్తారో చెప్పాలి. ఇచ్చిన మాట ప్రకారం 15వేల రైతు బంధు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా. ద్రవ్యోల్బణం పెరిగినందున రేషన్ కార్డు ఇన్‌కం లిమిట్ పెంచాలి