by Suryaa Desk | Wed, Jan 22, 2025, 11:39 AM
వికారాబాద్ జిల్లా కేంద్రం లో ఎమ్మార్పీఎస్ రథయాత్ర ఫిబ్రవరి 7న హైదరాబాద్ మహానగరంలో జరగబోయే వెయ్యి గొంతులు లక్ష డప్పుల కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవడంలో భాగంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రచార రథం మహాజన సోషలిస్ట్ పార్టీ జిల్లా అధ్యక్షులు పిల్లి కండ్ల ఆనంద్ మాది గారి ఆధ్వర్యంలో ప్రారంభమై వికారాబాద్ జిల్లాలో అన్ని మండలాలు తిరుగుతూ పది రోజుల సమయం మాదిగ కవులు కళాకారులు రచయితలను డప్పు తో చైతన్యం చేసి హైదరాబాద్ లో జరగబోయే మహా ప్రదర్శనను విజయవంతం చేసుకోవటకై ప్రతి ఒక్క మాదిగ బిడ్డ డప్పు సంకనేసుకుని ఫిబ్రవరి 7న హైదరాబాద్ కు తరలి రావలసిందిగా విజ్ఞప్తి న్యాయం బాబాసాహెబ్ అంబేద్కర్ పొందుపరి దళితుల్లో ఉండబడే అట్టడు సామా బాబాసాహెబ్ అయితే ఇవి దళితుల్లో ఉండబడే అన్ని కులాలకు అందట్లేదని ఉద్దేశంతో భారత ప్రభుత్వం ఎన్నో కమిషన్లను వేసింది వేసినటువంటి అన్ని కమిషన్లు కూడా ఈ రిజర్వేషన్లు దళితుల్లో ఉండబడి అన్ని కులాలకు అందట్లేదు ముఖ్యంగా మాదిగ మాదిగ ఉపకులాలకు అందక సామాజిక న్యాయానికి చాలా దూరంగా ఉన్నారని నివేదికలు భారత్ ప్రభుత్వానికి అందించడం జరిగింది. తదనంతరం 1994 లోనే మందకృష్ణ మాది గారు ఎమ్మార్పీఎస్ స్థాపించి అనేక ఉద్యమాలు చేసి చివరకు సుప్రీంకోర్టు ద్వారా ఈ రిజర్వేషన్లు వర్గీకరణ సాధించుకుంటే ఈ దేశంలోనే అత్యున్నత న్యాయస్థానం అయినటువంటి రాజ్యాంగ ధర్మాసనం ఏడుగురు జడ్జీలచే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ రాజ్యాంగబద్ధమైన సామాజిక న్యాయం అందరికీ అందాలనే ఉద్దేశంతో రాష్ట్రాలకు అధికారాలు ఇస్తూ ఎస్సి రిజర్వేషన్లను ఇమీడియట్గా అమలు చేయాలని జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. అయితే కొంతమంది మాలలు దీని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో మరొక్కసారి రాష్ట్ర ప్రభుత్వానికి బాలలకు కనువిప్పు కలిగే విధంగా వేయి గొంతులు లక్ష డప్పుల కార్యక్రమంతో వాళ్లను కళ్ళు తెరిచే విధంగా ఉద్యమించి హైదరాబాద్ నగరాన్ని డప్పులతో మారుమోగించి రిజర్వేషన్లను సాధించుకోవాలని పిలుపునివ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మహాజన సోషలిస్టు పార్టీ జాతీయ నాయకుల ఎంఎస్పీ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు రామచంద్ర మాదిగ, జాతీయ కళామండలి ఉపాధ్యక్షులు బచ్చలకూర స్వామి మాదిగ మేడ్చల్ జిల్లా కళామండలి అధ్యక్షులు రామచంద్ర మాదిగ ఎంఎస్పి జిల్లా ప్రధాన కార్యదర్శి స్వామిదాస్ మాదిగ ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి సుభాష్ మాదిగ ఎమ్మార్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి ప్రకాష్ మాదిగ, ఎంఎస్పి జిల్లా కార్యదర్శి డప్పు మహేందర్ మాదిగ ఎం ఎస్ పి జిల్లా ఉపాధ్యక్షులు బి కృష్ణ మరియు తాండూర్ నర్సింలు , ఎమ్మార్పీఎస్ జిల్లా కార్యదర్శి అంజి మాదిగ జిల్లా ఉపాధ్యక్షులు మల్కప్ప మాదిగ సీనియర్ నాయకులు రవికుమార్ మాదిగ మహిళా నాయకురాలు అన్నపూర్ణ మరియు పుష్పమ్మ వికారాబాద్ మండల ఇన్చార్జి శ్రీనివాస్ మాదిగ ఎంఎస్ఎఫ్ జిల్లా కన్వీనర్ శివాజీ మాదిగ ఎమ్మార్పీఎస్ మర్పల్లి మండల ఇన్చార్జి జగన్ ఎమ్మార్పీఎస్ దారూర్ మండలి ఇన్చార్జి గట్టేపల్లి రాజు, సర్పన్ పల్లి ఆనంద్ మోమిన్ పేట్ మండల నాయకులు రవికుమార్ మాదిగ న్యాయవాది శంకర్ మహవీర్ బంద్ మాదిగ ప్రజా ప్రతినిధులు పెద్దలు తదితరులు పాల్గొన్నారు.