by Suryaa Desk | Tue, Jan 21, 2025, 10:23 PM
శ్రీ దుర్గా స్విమ్మింగ్ పూల్ లో రాజన్న సిరిసిల్ల జిల్లా సర్దాపూర్ 17వ పోలీస్ బెటాలియన్ లో 100 మంది సిబ్బందితో స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ పోర్స్ (ఎస్డిఆర్ఎఫ్ ) సెలెక్షన్స్. రాష్ట్రములో ఏవైనా పర్యావరణ విపత్తులు సంభవించినప్పుడు ప్రజలను రక్షించడానికి తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి రాష్ట్రములోని ప్రతి బెటాలియన్ లో 100 మంది సిబ్బందితో స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ పోర్స్ (.ఎస్ డిఆర్ఎఫ్ ) విభాగం వుండాలనే ఉద్దేశముతో ప్రతి బెటాలియన్ లో స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ పొర్స్ విభాగమును ఏర్పాటు చేయాలని ఆదేశించారు.ముఖ్యమంత్రి ఆదేశల మేరకు తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలిస్ ( ఈజీఎస్పి) అడిషనల్ డీజీపి గారి ఆధ్వర్యంలో 17వ పోలిస్ బెటాలియన్ కమాండెంట్ శ్రీ టి.గంగారాం గారు 17వ బెటాలియన్ లో ఎస్ డి ఆర్ఎఫ్సెలక్షన్స్ నిర్వహించడం జరిగింది. సెలక్షన్స్ లో బాగంగా అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు స్విమ్మింగ్ పరీక్షలను నిర్వహించారు.
ఈ సంద్భంగా బెటాలియన్ కమాండెంట్ టి . గంగారాం మాట్లాడుతూ రాష్ట్రములో ఏవైనా పర్యావరణ విపత్తులు సంభవించినప్పుడు ప్రజలను రక్షించడానికి ఏర్పాటు చేసిందే తెలంగాణలోని రాష్ట్ర ప్రత్యేక విపత్తు నిర్వహణ బృందం (ఎస్టిఆర్ఎస్). ప్రజలను రక్షించడమే పోలీసుల మొదటి కర్తవ్యమని రాష్ట్రములో ఎటువంటి విపత్తులు సంభవించిన ఆ విపత్తుల నుండి ప్రజలను రక్షించడానికి ఎస్ డి ఆర్ఎఫ్ సిబ్బంది ఎల్లప్పుడూ సిద్ధముగా వుంటారని తెలియజేశారు. ఈ సెలక్షన్స్ కార్యక్రమంలో ఆర్ . ఐ. బి . శ్రీనివాస్, ఎ.రమేష్ ఆర్ ఎస్ ఐ లు పాల్గొన్నారు.