by Suryaa Desk | Tue, Jan 21, 2025, 09:59 PM
రాయపోల్ మండలంలోని అనాజీపూర్ గ్రామంలో 17వ శతాబ్దం నాటి వీరగల్లు శిల్పాలు ఉన్నాయని కొత్త తెలంగాణ చరిత్ర బృంద ఔత్సాహిక పరిశోధకుడు కొలిపాక శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలోని బేస్త ఎల్లయ్య వ్యవసాయ భూమిలో ఉన్న శిల్పం వీరగల్లు అని, ఈ శిల్పంలో వీరుడు ఎడమ చేతితో బాణం, కుడి చేతితో విల్లు పట్టుకొని యుద్ధ సన్నాధుడై ఉన్నాడు. మెడలో హారాలు, దండారెట్టలకు కడియాలు ఉన్నాయి.
శిల్పంలో వీరుడు బాణం ధరించి ఉండడం వల్ల కొంతమంది రాముడిగా, మరికొంత మంది హనుమంతుడిగా పిలుస్తున్నారు. గ్రామంలోని పోచమ్మ దేవాలయం దగ్గర కూడా ఇంచుమించు ఇదే పోలికలతో ఉన్న మరో వీరగల్లు శిల్పం ఉంది. ఆ శిల్పంలో వీరునికి పొడవాటి వెంట్రుకలు మూడి కట్టి ఉండడం వల్ల ఆ శిల్పాన్ని స్త్రీ శిల్పంగా పిలుస్తున్నారు. గ్రామం బయట పేట మీద అని పిలిచే చోట హనుమాన్ దేవాలయం ఉంది. ఈ హనుమాన్ దేవాలయంలో ఉన్న నంది, వినాయకుడు, నాగశిల చాళుక్యుల కాలానికి చెందినయని అన్నారు...