by Suryaa Desk | Tue, Jan 21, 2025, 09:57 PM
సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలోని పెద్దమ్మ గుడి దగ్గర జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తున్న జాతీయ బీసీ సంక్షేమ సంఘం సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు కంకటి నవీన్ గౌడ్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం మిరుదొడ్డి మండలం నుంచి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. మండల యువజన అధ్యక్షుడిగా అంజి ముదిరాజ్ ను ఎన్నుకున్నారు.దుబ్బాక పట్టణ బీసీ నాయకులు అందరితోని కూడా కలవడం జరిగింది.భవిష్యత్తులో రానున్న రోజుల్లో స్థానిక సంస్థ ఎన్నికలలో బీసీలకు మూడు ప్రధాన పార్టీల్లో కూడా 60% టికెట్లను బీసీలకే కేటాయించాలని ప్రతిపాదన తీసుకొస్తా ఉన్నాం.
ఫిబ్రవరిలో బీసీ గర్జన అనే సిద్దిపేటలో అనే వాదనతో సిద్దిపేట కేంద్రంలో బీసీ గర్జన సభ ఏర్పాటు చేయబోతున్నాం అని అన్నారు. పదివేల మందితోని బీసీ గర్జన పెడతా ఉన్నాము. యువకులు, బీసీ నాయకులు అందరు కూడా పార్టీలకు అతీతంగా ఖచ్చితముగా అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరుతున్నాము భవిష్యత్తులో దుబ్బాక నియోజకవర్గం నుంచి దుబ్బాక మున్సిపాలిటీలో చెర్మన్ హోదా కు ఓసిలకే రిజర్వేషన్ ఇచ్చారు. బీసీలకు రానున్న ఎన్నికల్లో కూడా ఈసారి మున్సిపల్ చైర్మన్ పదవికి బీసీ రిజర్వేషన్ కేటాయించాలని కోరుతూ ఉన్నాం.బీసీలకే అధిక రిజర్వేషన్లు ఇవ్వాలని చైర్మన్ పదవి కూడా ఇవ్వాలని కోరారు. మండల స్థాయిలో స్థానిక ఎన్నికల్లో ఓపెన్ కేటగిరీలో కూడా బీసీలే బీసీలకే కేటాయించే విధంగా కృషి చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులు,తోగుట అనిల్సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రభు,బోయ రాములు,పవన్ కుమార్, శ్రీకాంత్, రాకేష్, పెంబర్తి భాస్కర్, పలువురు పాల్గొన్నారు.