by Suryaa Desk | Wed, Jan 22, 2025, 11:36 AM
వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిను సందర్శించి మీడియాతో మాట్లాడిన వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్.నిధులు అన్ని కొడంగల్ కేనా స్పీకర్ వికారాబాద్ అభివృద్ధి కి 4 వేల కోట్లు ఎక్కడ కాంగ్రెస్ పై మండిపడ్డ టిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ కాంగ్రెస్ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను రైతు రుణమాఫీ పేరుతో మాయ మాటలు చెప్పి కాలం గడుపుతుంది.
జిల్లాకు ముఖ్యమంత్రి మరియు స్పీకర్ ఉన్నా కూడా అభివృద్ధి ఎక్కడ...! వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిను సందర్శించి మీడియాతో మాట్లాడిన వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్. జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితి దారుణంగా ఉంది కెసిఆర్ ప్రభుత్వంలో గర్భిణీ స్త్రీలకు కెసిఆర్ కిట్టు ఇచ్చేది ఇప్పుడు అది ఏమైంది వికారాబాద్ జిల్లాను గాలికి వదిలేశారు. వికారాబాద్ జిల్లాలో గుంతల రోడ్లను బాగు చేయండి. వికారాబాద్ పట్టణంలో బ్రిడ్జి నిర్మాణ పనులు స్పీడ్ గా చేసి తొందరగా పూర్తి చేసేటట్టు స్పీకర్ చూడాలి...