by Suryaa Desk | Wed, Jan 22, 2025, 10:58 AM
స్వామి వివేకానంద 162 వ జయంతి వీక్లీ సెలబ్రేషన్ లో భాగంగా నెహ్రూ యువ కేంద్రం శ్రీ వివేకానంద యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూలపల్లి మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అవేర్నెస్ డే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రిన్సిపల్ విశ్వ ప్రసాద్,సురేష్, వెంకటేశ్వర్ ,అధ్యాపకులు మోటివేషన్ స్పీకర్ ఆంజనేయులు, యువజన వాలంటరీ రేషవేణి మహేష్,ధీరజ్ పాల్గొని స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
అనంతరం విద్యార్థులతో ఉపన్యాసం ఇవ్వడం జరిగింది. మన దేశానికి వెన్నుముక అయినాంటి యువత ఎలాంటి చెడు మార్గాలకు వెళ్ళకూడదు అని యువత అందరూ వివేకానంద స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.