by Suryaa Desk | Wed, Jan 22, 2025, 03:28 PM
కందుల కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని మార్కెట్ యార్డ్ చైర్మన్ దొడ్డెప్ప పేర్కొన్నారు. బుధవారం అలంపూర్ లోని మార్కెట్ యార్డు ఆవరణలో కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. క్వింటాలకు ప్రభుత్వ మద్దతు ధర రూ. 7, 550 నిర్ణయించిందని ఆయన రైతులకు సూచించారు. నిబంధన ప్రకారం తేమశాతాన్ని బట్టి కొనుగోలు చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ కుమార్ పాల్గొన్నారు.