by Suryaa Desk | Wed, Jan 22, 2025, 04:46 PM
హనుమకొండలో దారుణం జరిగింది. అదాలత్ సెంటర్ వద్ద పట్టపగలే ఆటోడ్రైవర్‌ను మరో ఆటో డ్రైవర్ అందరూ చూస్తుండగా కత్తితో పొడిచి చంపేశాడు. సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలోని డీమార్ట్ ఎదురుగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఆటోడ్రైవర్లు మాచర్ల రాజ్ కుమార్, వెంకటేశ్వర్లు కత్తులతో దాడి చేసుకున్నారు. వీరిలో రాజ్‌కుమార్ చనిపోయాడు. మృతుడిది మడికొండ అని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎంకు తరలించారు. ఈ హత్యకు గత కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే, ఈ హత్యకు ప్రేమ వ్యవహారమే కారణం కావొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం దాడి చేసిన వెంకటేశ్వర్లును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.