by Suryaa Desk | Fri, Jan 24, 2025, 03:36 PM
ఇండియన్ నేషనల్ ట్రేడ్స్ యూనియన్ కాంగ్రెస్ (ఫెడరేషన్) లీగల్ సెల్ వరంగల్ జిల్లా అధ్యక్షులుగా చెన్నారావుపేట్ మండలం, ఉప్పరవెల్లి గ్రామానికి చెందిన న్యాయవాది అనుమాండ్ల రాజు కుమార్ ను నియమిస్తూ శుక్రవారం రాష్ట్ర అధ్యక్షులు బుద్దారం మురహరి నియామక ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ప్రధాన కార్యదర్శిగా పొలాస శివకుమార్, ఉపాధ్యక్షులుగా విక్రమ్, ఆర్గనైజర్ గా భూక్యా రమేష్ లను నియమించారు.