by Suryaa Desk | Thu, Jan 23, 2025, 01:44 PM
అనుమానవస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మేడ్చల్ జిల్లా మునీరాబాద్ గ్రామంలో గల రాజ్ కమల్ ప్యాలెస్ పక్కన జేబీ హోమ్స్ వెంచర్ లో గురువారం గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి ఎరుపు చొక్క, నీలం రంగు ప్యాంటు ధరించగా స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకొని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.