by Suryaa Desk | Thu, Jan 23, 2025, 04:18 PM
ఏకలవ్య మోడల్ రెసిడెన్సియల్ స్కూల్లో 6వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఏకలవ్య మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ కనిక తెలిపారు. ఫిబ్రవరి 16వ తేదివరకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గల 23 ఏకలవ్య పాఠశాలలలో 1380 ఖాళీలకు ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరించి ప్రవేశ పరీక్ష నిర్వహించి దానిలో వచ్చిన మార్కుల ఆధారంగా రిజర్వేషన్ పాటిస్తూ విద్యార్ధుల ఎంపిక జరుగుతుందన్నారు. దరఖాస్తులను టీఎస్ఈఎంఆర్ఎస్. తెలంగాణ. జీవోవీ. ఇన్ చేసుకోవచ్చన్నారు.
గిరిజన, తల్లిదండ్రులు లేని, దివ్యాంగులైన తల్లిదండ్రులు గల విద్యార్థులు ఐదవ తరగతి చదివి ఉండి మార్చి 2025 నాటికి 10 నుంచి 13 ఏండ్ల లోపు వయస్సు ఉండాలన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు సంవత్సర ఆదాయం పట్టణ ప్రాంతం రూ.2లక్షలు, గ్రామీణ ప్రాంతం వారి ఆధాయం రూ.1.50 లక్షలు లోపు ఉండాలన్నారు. మార్చి 16 న ప్రవేశపరీక్ష ఉంటుందని తెలిపారు. పరీక్షా రుసుం రూ.100 ఉంటుందని తెలిపారు. ఏకలవ్య స్కూల్ 6వ తరగతిలో 30 మందికి బాలికలకు, 30 మంది బాలురకు ఖాళీలు ఉన్నాయన్నారు. ఆసక్తిగల వారు ఆన్లైన్ దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.