by Suryaa Desk | Thu, Jan 23, 2025, 10:46 AM
తెలంగాణలో భారీ పెట్టుబడులపై దావోస్లో మరో కీలక ఒప్పందం జరిగింది. గత రెండు రోజల్లో చెప్పుకోదగ్గ ఒప్పందాలు కనించలేదు. కానీ మూడో రోజు ఒకేసారి పెద్ద పెట్టుబడి వచ్చింది.రూ.45,500 కోట్ల పెట్టుబడులతో సన్ పెట్రో కెమికల్స్ ఎంవోయూ చేసుకుంది. తెలంగాణలో భారీ పంప్డ్ స్టోరేజీ పవర్, సోలార్ పవర్ ప్రాజెక్టుల ఏర్పాటుపై ఒప్పందం జరిగింది. రాష్ట్రంలోని నాగర్ కర్నూల్, మంచిర్యాల, ములుగు ప్రాంతాల్లో ఈ ప్రాజెక్టులు ఏర్పాటు కానున్నాయి. సన్ పెట్రో కెమికల్స్ ప్రాజెక్టులతో 7వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలంగాణ ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇప్పటివరకు ఈ మూడు రోజుల్లో దావోస్ లో తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న భారీ ఒప్పందం ఇదే. ఈ పెట్టుబడిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.స్విట్జర్లాండ్ లోని దావోస్లో జరుగుతోన్న ప్రపంచ ఆర్థిక సదస్సుకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, ఇతర తెలంగాణ అధికారులు హాజరయ్యారు. రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా తెలంగాణ టీమ్ వివిధ కంపెనీల ప్రతినిధులతో రోజూ భేటీ అవుతున్నారు. తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న అవకాశాలు, ప్రభుత్వం కల్పించే రాయితీల గురించి కంపెనీలకు వివరిస్తున్నారు. మూడు రోజల్లో ఇప్పటి వరకు యూనీ లీవర్, స్కైరూట్, కంట్రోల్ ఎస్ డేటా సెంట్స్ లిమిటెడ్ సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి.