by Suryaa Desk | Thu, Jan 23, 2025, 10:38 AM
TG: దేశంలోని ప్రముఖ నగరాల్లో 2023తో పోలిస్తే.. 2024 సంవత్సరంలో ఇళ్ల అమ్మకాలు పడిపోయాయి. 9 ప్రధాన నగరాల్లోని ఇళ్ల విక్రయాలకు సంబంధించి ఈ మేరకు లెక్కలను విడుదల చేసింది డేటా అనలిటిక్స్ సంస్థ ప్రాప్‌ఈక్విటీ. హైడ్రా కారణంగా హైదరాబాద్‌లోనే ఇళ్ల అమ్మకాల సంఖ్య భారీగా పడిపోవడం గమనార్హం. 2023 అక్టోబర్- డిసెంబరులో 20,491 ఇళ్లు అమ్ముడు కాగా.. గతేడాది చివరి 3 నెల్లలో ఇది 13,179 యూనిట్లు మాత్రమే అమ్ముడైనట్లు నివేదిక చెబుతుంది.