by Suryaa Desk | Wed, Jan 22, 2025, 07:44 PM
జిల్లా కలెక్టర్ ఎంతో బిజీగా ఉంటారో అదరికీ తెలిసిందే. జిల్లా పాలనా బాధ్యతలు, సమీక్షలు, సమావేశాలు అంటూ క్షణం తీరక లేకుండా ఉంటారు. ముఖ్యమంత్రి, మంత్రులతో మీటింగులు, అధికారులతో సమావేశాలంటూ ఊపిరాడకుండా పని ఉంటుంది. కలెక్టర్లకు ఏదైనా కాస్త సమయం దొరికితే కుటుంబసభ్యులతో గడిపేందుకు ప్రయత్నిస్తారు. కానీ ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అలా కాదు. ఖాన్ పేరు చెప్తే విద్యార్థుల ముఖాల్లో నూతనోత్సాహం కనిపిస్తోంది. కలెక్టర్ స్థాయిలో బిజీగా ఉన్నప్పటికీ సమయం కుదుర్చుకుని మరీ ఆయన చిన్నారులు, విద్యార్థులను కలుస్తున్నారు. వారికి సొంత అన్నలాగా అండగా నిలుస్తున్నారు. విద్యార్థులతో మాట్లాడి జీవితం నేర్పే పాఠాల గురించి దిశానిర్దేశం చేస్తున్నారు.