by Suryaa Desk | Thu, Jan 23, 2025, 04:26 PM
అక్రమ రవాణాల పైన జిల్లాలో నిరంతరంగా టాస్క్ ఫోర్స్ అధికారుల దాడులు నిర్వహించడం జరుగుతుంది. జిల్లా ఎస్పీ తెలిపారు .జిల్లా టాస్క్ ఫోర్స్ అధికారులు జిల్లాలోని యాలాల పోలీస్ స్టేషన్ పరిధిలో దాడులు చేసి 4 ఇసుక ట్రాక్టర్ లు, ఒక కలప ట్రాక్టర్ ను పట్టుకొని సిజ్ చేయడం జరిగింది అని ఎస్పీ తెలిపినారు.
ఇట్టి వివరాలు టాస్క్ ఫోర్స్ బృందం యాలాల్ పీస్ పరిధిలోని రస్నాం గ్రామ శివార్లలో అనుమతి లేకుండా కలప రవాణా చేస్తున్నా ట్రాక్టర్‌ని విశ్వనాధ్ పూర్ గ్రామ శివారులో నుండి అక్రమంగా ఇసుక తరలిస్తున్నా 4 ఇసుక ట్రాక్టర్ లను కూడా పట్టుకొని సిజ్ చేసి యాలాల పోలీస్ స్టేషన్ పరిధిలో కేసులు నమోదు చేయడం జరిగింది. జిల్లాలో ఎక్కడైనా అసాంఘిక కార్యక్రమాలు జరిగిన, అక్రమ రవాణాలు జరిగిన వెంటనే టాస్క్ ఫోర్స్ అధికారులకు సంప్రదించాలని జిల్లా ఎస్పీ తెలియజేయడం జరిగింది.