by Suryaa Desk | Thu, Jan 23, 2025, 04:09 PM
జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా వికారాబాద్ పోలీసుల ఆధ్వర్యం లో కొండా బాల కృష్ణ రెడ్డి పంక్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన అవగాహనా సదస్సులో జిల్లా ఎస్పీ కె నారాయణ రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొనడం జరిగింది.ఇట్టి కార్యక్రమం లో
ఎస్పీ మాట్లాడుతూ అన్ని శాఖల సమన్వయంతో వికారాబాద్ జిల్లాలో ట్రాఫిక్ సమస్యను,పార్కింగ్ సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు చేపడతామని తెలిపారు.ట్రాఫిక్ సమస్యలను నియంత్రించడంలో పోలీసు వారు చేపట్టే కార్యక్రమాలకు జిల్లా ప్రజలందరూ సహకరించాలని కోరారు.అదే విధంగా జిల్లా ప్రజలందరూ ట్రాఫిక్ నియమ,నిబంధనలు పాటిస్తూ పోలీసు వారికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా జిల్లాలో అధికంగా రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రదేశాల(బ్లాక్ స్పాట్స్ )ను గుర్తించి అక్కడ సంబంధిత శాఖలతో సమన్వయం పాటిస్తూ నివారణా చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. వ్యాపారస్తులు,ఆటో డ్రైవర్లు మరియు పట్టణ ప్రజలు ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా పోలీస్ వారి సూచనలను పాటించాలని అన్నారు.
అన్ని శాఖల వారు సమిష్టిగా ట్రాఫిక్ నియంత్రణ రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలని సూచించారు.అనంతరం జాతీయ రోడ్డు భద్రత ఉత్సవాల సంబంధించిన ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో డి టీ ఓ పి. వెంకట్ రెడ్డి , వికారాబాద్ డీస్పీ శ్రీనివాస్ రెడ్డి , ఎంవీ ఐ జోసెఫ్ , వికారాబాద్ ఇన్స్పెక్టర్ భీమ్ కుమార్ ,సిబ్బంది తదితరులు పాల్గొనడం జరిగింది.