by Suryaa Desk | Thu, Jan 23, 2025, 04:28 PM
ప్రజాస్వామ్యంలో ఓటుకు ప్రత్యేక గుర్తింపు ఉందని అందోలు తహశీల్దార్ విష్ణుసాగర్ అన్నారు. బుధవారం జోగిపేటలోని పలు ప్రధాన కూడలిల వద్ద కళాకారుల ఆధ్వర్యంలో ఓటరు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా తహసీల్దారు మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన యువతీ, యువకులు ఓటుహక్కు కోసం దరఖాస్తు చేసుకొని, ఓటరుగా నమోదు చేసుకొవాలన్నారు. తమకు అనుకూలమైన ప్రభుత్వాలను ఏర్పరచుకోవడంలో ఓటర్లదే కీలకభాద్యతయని అన్నారు.
ఈ నెల 25న జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఓటు హక్కు ఉన్న ప్రతి ఒటరు ఎన్నికల సమయంలో తప్పకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఈ నెల 25వ తేదీన నిర్వహించనున్న జాతీయ ఓటరు దినోత్సవ కార్యక్రమంలో ప్రతిఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కొరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహశీల్దార్ (ఎన్నికలు) చంద్రశేఖర్, కళాకారుల బృందం సభ్యులు కొమ్ములు శేఖర్ గౌడ్, నేనవాత్ మదన్ సింగ్,నేనవాత్ రవీందర్,నల్లవాగుల శశిప్రియ,ధరవాత్ రాజు,చామంతి ఆగమయ్య, సాయిలు తదితరులు పాల్గొన్నారు.