by Suryaa Desk | Thu, Jan 23, 2025, 04:20 PM
రైతు భరోసా కొత్త రేషన్ కార్డులు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఇళ్ల పథకాలకు అర్హులైన లబ్ధిదారుల ఎంపిక కోసం రెండవ రోజు లక్కవరం వాయిలి సింగారం అమీనాబాద్ వసంతాపురం కొత్త గోల్ తండా గ్రామపంచాయతీ పరిధిలో బుధవారం గ్రామ సభకు రెవెన్యూ అధికారులు పంచాయతీరాజ్ అధికారులు హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అందిస్తామని అన్నారు.
ఈనెల 26 నుంచి ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా ఇందిరమ్మ ఇళ్ల ఆహార భద్రత కార్డులు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల గురించి గ్రామస్తులకు వివరించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి తప్పకుండా సంక్షేమ పథకాలు అందిస్తామని ప్రజలు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అర్హులుగా ఉండి జాబితాలో తమ పేర్లు రానివారు దరఖాస్తు రాసి పంచాయతీ కార్యాలయంలో అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు వివిధ గ్రామాల ప్రజలు మహిళలు తదితరులు పాల్గొన్నారు