by Suryaa Desk | Thu, Jan 23, 2025, 03:20 PM
చింతలమానేపల్లి మండలంలోని లంబడిహెట్టి, రణవెల్లి గ్రామాల్లోని నాటుసారాయి స్థావరాలపై గురువారం ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. ఎక్సైజ్ సీఐ వీ రవి తెలిపిన వివరాల ప్రకారం.. తమకు అందిన సమాచారం మేరకు దాడులు నిర్వహించామన్నారు. ఈ దాడులలో 60లీటర్ల నాటుసారా, 30 కిలోల బెల్లం, 10 కిలోల పటికని స్వాధీన పరచుకుని, ఆరుగురిపై కేసులు నమోదు చేశాన్నారు. 4000 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేసిట్లు సీఐ తెలిపారు.