by Suryaa Desk | Thu, Jan 23, 2025, 04:23 PM
ప్రధానమంత్రి శ్రీ. నరేంద్ర మోడీ జనవరి 22.2015 న ప్రారంభించినటువంటి బేటి బచావో- బేటి పడావో స్కీం నేటికీ దశాబ్ది కాలం అవుతున్న సందర్భంగా జిల్లా సంక్షేమ అధికారి పి వేణుగోపాల్ మహిళా సాధికారత కేంద్ర బృందం చేత ఈనెల 22 నుండి మార్చి 8 వరకు జిల్లాలలో వివిధ కార్యక్రమాలు చేపట్టనున్నారు.
ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని నేడు పెద్దపల్లి పట్టణంలోని వివిధ పాఠశాల విద్యార్థుల చేత ప్రతిజ్ఞ ఆడపిల్లల సంరక్షణ పై అవగాహన కల్పించారు మరియు గవర్నమెంట్ ఆసుపత్రి నందు సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు .ఈ కార్యక్రమంలో మహిళా సాధికారత కేంద్రం కోఆర్డినేటర్ దయ అరుణ ,ఫైనాన్షియల్ లిటరసీ.ఎస్.సంధ్య ఆసుపత్రి డాక్టర్లు సూపెరిoడెంట్,లయన్స్ క్లబ్ మెంబర్లు డిసిపిఓ కమలాకర్, చైల్డ్ లైన్ కోఆర్డినేటర్ ఉమాదేవి, సఖి సిఏ స్వప్న పోషణ ,అభియాన్ కోఆర్డినేటర్ అనిల్ కుమార్ , ఐ సి పి ఎస్ బృందం,ఐ సి డి ఎస్ బృందం,కమ్యూనిటీ ఎడ్యుకేటర్లు,తదితరులు పాల్గొన్నారు.