by Suryaa Desk | Thu, Jan 23, 2025, 03:26 PM
వీణవంక మండలం చల్లూరు గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామసభలో హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పాల్గొని ప్రభుత్వ తీరును విమర్శించారు. కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ... ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రుణమాఫీ పూర్తయిందని చెబుతున్న చల్లూరు గ్రామంలో 50 శాతం రైతులకు రుణమాఫీ ఇప్పటికీ అమలు కాలేదని రుణమాఫీపై ప్రభుత్వానికి నిజాయితీ ఉంటే రాష్ట్రవ్యాప్తంగా జరిగిన రుణమాఫీ వివరాలను శ్వేత పత్రం ద్వారా విడుదల చేయాలని అన్నారు. ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులను ఆన్లైన్ చేయకపోవడం వల్ల ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని,ప్రజలు ఎన్ని దఫాలుగా దరఖాస్తులు పెట్టుకోవాలని దరఖాస్తు పెట్టిన ప్రతిసారి అధిక మొత్తంలో ఖర్చు అవుతుందని ఇది ప్రజలకు ఆర్థిక భారంగా మారిందని అన్నారు.అర్హులైన ఎస్సీ, ఎస్టీలకు ఇందిరమ్మ ఇల్లు కోసం ఆరు లక్షలు ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పటివరకు అమలు చేయలేకపోయారని అర్హులైన పేదలందరికీ ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. రేషన్ కార్డుల విషయంలో ఆదాయ పరిమితి పెంచిన అర్హులందరికీ అందరికీ రేషన్ కార్డులు అందడం లేదని ఇది ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం అని అన్నారు. ప్రభుత్వం మోసాలపై ఆధారపడి ప్రజలను విస్మరిస్తుందని, ప్రజా సమస్యలను ప్రశ్నించే వారిపై అరెస్టులు చేయడం ప్రజా వ్యతిరేక పాలనకు నిదర్శనం అన్నారు.ప్రభుత్వం ప్రజల డబ్బులను దుర్వినియోగం చేయడం ఆపాలని రైతులు, కూలీలు,పేదలు, మహిళా సమస్యలు పట్టించుకోని వాటిని పరిష్కరించాలని లేనిపక్షంలో ప్రజా పోరాటాలు మరింత ఉధృతంగా సాగుతాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట మాజీ మార్కెట్ చైర్మన్ వాల బాలకిషన్ రావు, సింగిల్ విండో చైర్మన్ విజయ భాస్కర్ రెడ్డి,మాజీ ఎంపీపీ రేణుక తిరుపతి రెడ్డి,మాజీ జెడ్పిటిసి వనమాల సాధవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.