by Suryaa Desk | Wed, Jan 22, 2025, 09:28 PM
తెలంగాణ సచివాలయం కు వచ్చే సందర్శక ల పట్ల ప్రభుత్వం ఆంక్షలు విధిస్తుంది. ఇకపై సచివాలయం లోపలకు వెళ్లే వారికి ఇచ్చే పాసుతో ఒక్కరికి మాత్రమే అనుమతినిస్తారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సచివాలయానికి వివిధ పనుల నిమిత్తం వచ్చే సందర్శకుల పట్ల కఠిన నిబంధనలు అమలు చేయడం తీవ్ర విమర్శల పాలైంది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మాదీ ప్రజాప్రభుత్వమంటూ ఆంక్షలను సడలించింది.అయితే సందర్శకుల తాకిడి అధికం కావడంతో పాటు..భద్రత పటిష్టం చేసే క్రమంలో ఎస్పీఎఫ్( SPF) సిబ్బంది సందర్శకుల సంఖ్యను క్రమబద్ధీకరించే చర్యలను క్రమంగా అమల్లోకి తేవడం ప్రారంభించారు. ప్రస్తుతం సచివాలయంలో సీఎం కార్యాలయం ఉండే ఆరో అంతస్థుకు విజిటర్స్ అనుమతి నిరాకరించారు. నిన్న చీఫ్ సెక్రటరీ ఫ్లోర్ లో సందర్శకులు ఎక్కువగా కనిపించడంతో ఉన్నతాధికారులు ఎస్పీఎఫ్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సందర్శకులపై కొత్త ఆంక్షలు తీసుకొచ్చారు.ఇటీవల ప్రభుత్వం సచివాలయంలో వాస్తు పేరుతో మార్పులు చేసి తూర్పు వైపున ప్రధాన ద్వారం(బాహుబలి ద్వారం) మూసివేశారు. ఈశాన్యం వైపుకు ప్రధాన గేటును మార్చారు. ఉద్యోగులు, అధికారుల హాజరుకు బయోమెట్రిక్ పద్దతిని అమలులోకి తెచ్చారు. తాజాగా సందర్శకులపై ఆంక్షలు అమల్లోకి తెచ్చారు.