by Suryaa Desk | Thu, Jan 23, 2025, 12:59 PM
గులాబీ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ లో చేరిన ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీ లో చేరిన ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి క్యాంప్ ఆఫీస్ ముట్టడి చేసారు.దింతో పటాన్‌చెరు కాంగ్రెస్ ధర్నాలో ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ పార్టీ లో చేరిన ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు కాట వర్గీయులు ప్రయత్నం చేశారు.అయితే పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది.. నిరసనగా ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి క్యాంప్ ఆఫీస్ ముట్టడి చేసారు కాట వర్గీయులు. 'సేవ్ కాంగ్రెస్.. సేవ్ పటాన్‌చెరు' నినాదంతో రోడ్డెకారు కార్యకర్తలు, నాయకులు. పార్టీ మారి వచ్చిన గూడెం.. తన అనుచరవర్గంతో కాంగ్రెస్ నాయకులపై దాడులు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. పటాన్‌చెరు నియోజకవర్గంలోని బొల్లారంలో పాత కాంగ్రెస్ నాయకులను గూడెం బూతులు తిట్టారని ఆరోపణలు వస్తున్నాయి.