by Suryaa Desk | Thu, Jan 23, 2025, 02:42 PM
సుల్తానాబాద్ పట్టణంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలను గురువారం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నేతాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు కందుల శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు కూకట్ల నాగరాజు, సీనియర్ నాయకుడు కడారి అశోక్ రావు, బీజేపీ సీనియర్ నాయకులు సౌదరి మహేందర్ యదవ్, కొమ్ము తిరుపతి, కామని రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు.