by Suryaa Desk | Thu, Jan 23, 2025, 04:55 PM
జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం లోత్తునూర్ గ్రామంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉచిత పశువైద్య,గర్భకోశ వ్యాధి,చుడి పరీక్షల శిబిరం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమం లో 80 కి పై బడిన పశువులకి వైద్యం చేయడం జరిగింది.ఇందులో 45కి పైగా గర్భకోశ వ్యాధులకి వైద్యం చేయడం జరిగింది.
20పశువులలో చుడి పరీక్షలు 15కి పైగా దూడలలో నట్టల నివారణ మందులు వేయడం జరిగింది.ఈ కార్యక్రమం లో పశువైద్యధికారులు డాక్టర్ తిరుపతి గౌడ్,డాక్టర్ రవీందర్,డాక్టర్ అచ్చే శ్రీనివాస్ లు మరియు వెటరినరీ అసిస్టెంట్ లు ప్రవీణ్,సంధ్య గోపాలమిత్రలు శ్రీకాంత్,రవీందర్,నరహరి పాల్గొన్నారు.